అన్ని విషయాలు చెబితే బాగుంటుంది: ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత స్పందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అన్ని విషయాలు చెబితే బాగుంటుంది: ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత స్పందన

Sunitha Responds to Pravasthis Allegations
  • ప్రవస్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సునీత
  • అన్ని విషయాలు వ్యక్తిగతంగా తీసుకుంటోందని వ్యాఖ్య
  • టీవీ ఛానళ్లలో పాటల హక్కుల పరిమితులు ఉంటాయని వివరణ
  • పోటీల ప్రక్రియపై ప్రవస్తికి అవగాహన ఉండాలని సూచన
వర్ధమాన గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలపై ప్రముఖ గాయని, పలు రియాలిటీ షోల న్యాయనిర్ణేత సునీత స్పందించారు. ప్రవస్తి ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రవస్తి అన్ని విషయాలను తనకు వ్యక్తిగతంగా ఆపాదించుకుంటోందని సునీత అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులకు ప్రతి విషయం చెబితే బాగుంటుందని అన్నారు.

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, ప్రవస్తిని చిన్నప్పుడు తాను ముద్దు చేశానని, ఇప్పుడు ఈ వయసులో అలా చేస్తే బాగుండదు కదా అని అన్నారు. పోటీల్లో ఎవరు బాగా పాడినా అందరం లీనమైపోతామని, భావోద్వేగానికి గురవుతామని అన్నారు. ఆయా ఎపిసోడ్స్‌ను ప్రవస్తి సరిగా గమనించినట్లు లేదని అన్నారు. "నువ్వు ఎన్నో పోటీల్లో పాల్గొన్నావు కదా, వాటి ప్రక్రియ ఎలా ఉంటుందో నీకు తెలియదా?" అని ప్రశ్నించారు.

సంగీత కార్యక్రమాలకు సంబంధించి టీవీ ఛానళ్లకు కొన్ని సాంకేతిక పరిమితులు ఉంటాయని సునీత గుర్తుచేశారు. "సంగీతం విషయంలో ఛానల్స్‌కు కొన్ని పరిమితులుంటాయి. అందువల్ల అన్ని పాటలూ పాడే అవకాశం ఉండదు. కేవలం హక్కులు ఉన్న పాటలను మాత్రమే పోటీలో పాడాల్సి ఉంటుంది. ఈ విషయాలను ప్రేక్షకులకు కూడా నువ్వు వివరిస్తే బాగుంటుంది. అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను" అని సునీత తెలిపారు.

ఇక, ప్రవస్తి తమ గురించి మాట్లాడే స్థాయికి వెళ్లడం పట్ల అసంతృప్తిగా ఉందని సునీత అన్నారు.
Advertisement
Sunitha
Pravasthi
Singer Sunitha
Reality Show Judge
Singing Competition
Controversy
Telugu Singer
Music Industry
TV Show
Allegations

More Telugu News