Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత లేఖ

CPI Leader Writes to AP CM Chandrababu Naidu Regarding Mega DSP Notification
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  కె. రామకృష్ణ పేర్కొన్నారు. అయితే, ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అభ్యర్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వయోపరిమితిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం రామకృష్ణ లేఖ రాశారు.

2018 తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని రామకృష్ణ తన లేఖలో గుర్తుచేశారు. అప్పటి నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు వేచి చూస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో అభ్యర్థుల్లో వయోపరిమితిపై ఆందోళన నెలకొందని చెప్పారు. వయోపరిమితి 47 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని, మెగా డీఎస్సీ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని రామకృష్ణ తన లేఖలో సీఎం చంద్రబాబును కోరారు.
Go Back to Shorts
Chandrababu Naidu
CPI
K Ramakrishna
Mega DSP Notification
Andhra Pradesh
Age Limit
DSC Notification
AP Government
Recruitment
Government Jobs

More Telugu News