UP Police: చేతిలో తుపాకీతో.. మద్యం మత్తులో న‌డిరోడ్డుపై తూలిన‌ పోలీస్ కానిస్టేబుల్‌.. వీడియో వైర‌ల్‌!

Drunk UP Police Constable Falls on Road with Gun Viral Video
  • యూపీలోని బిజ్నోర్‌లో ఘ‌ట‌న‌
  • నెట్టింట వైర‌ల్ గా మారిన వీడియో
  • పోలీస్ కానిస్టేబుల్‌పై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన ఉన్న‌తాధికారులు
యూపీలోని బిజ్నోర్ వీధుల్లో జ‌రిగిన ఓ షాకింగ్ ఘ‌ట‌న తాలూకు వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఒక‌ పోలీస్‌ చేతిలో తుపాకీ పట్టుకుని మద్యం మ‌త్తులో రోడ్డుపై తూలిపడ‌టం వీడియోలో ఉంది. బిజ్నోర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని జాజీ చౌక్ వద్ద ఈ సంఘటన జరిగింది. 

యూనిఫాం ధరించిన ఒక పోలీస్‌ వద్ద సర్వీస్‌ రైఫిల్ ఉంది. పూటుగా మద్యం సేవించిన‌ అతడు తూలుతూ రద్దీగా ఉన్న రోడ్డుపై పడ్డాడు. దాంతో పైకి లేచేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. ఇక ఆ పోలీస్‌ వద్ద తుపాకీ ఉండటంతో ఆయనతో పాటు ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరగవచ్చని అక్కడున్న జనం భయాందోళనకు గుర‌య్యారు.

కాగా, అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ ఇది చూసి వెంట‌నే స్పందించాడు. తుపాకీతో మద్యం మత్తులో ఉన్న పోలీస్‌ను పైకిలేపి రోడ్డు పక్కకు తీసుకెళ్లాడు. ఈ ఘ‌ట‌న‌ తాలూకు వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో బిజ్నోర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ దీనిపై స్పందించింది. ఆ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ చర్యలు చేపట్టినట్లు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ద్వారా వెల్ల‌డించింది. 


UP Police
Drunk Police Constable
Bijnor Police
Viral Video
India Police
Police Suspension
Service Rifle
Traffic Police
Jaji Chowk
Drunk on Duty

More Telugu News