ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కు వర్షం ఆడ్డంకి

Rain Delays RCB vs Punjab Kings IPL Match
ఐపీఎల్ లో ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఆడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బెంగళూరులో వర్షం కురుస్తోంది. చిన్నస్వామి స్టేడియం చిత్తడిగా మారడంతో ఇప్పటివరకు టాస్ వేయలేదు. ఇప్పటికీ వర్షం ఆగకపోవడంతో టాస్ మరింత ఆలస్యం కానుంది. పిచ్ ను, 30 యార్డ్స్ సర్కిల్ ను కవర్లతో కప్పి ఉంచారు. 

టోర్నీలో ఇప్పటివరకు ఆర్సీబీ 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా 6 మ్యాచ్ ల్లో 4 విజయాలు నమోదు చేసింది. అయితే బెంగళూరు జట్టు కంటే నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
Go Back to Shorts
Royal Challengers Bangalore
Punjab Kings
IPL 2023
Rain Delay
Cricket Match
Bengaluru
Chinnaswamy Stadium
RCB vs PBKS
IPL

More Telugu News