Car Owner: కారు తీయకుండానే సిమెంట్ రోడ్డు వేసేశారు!

Cement Road Built Over Parked Car in Andhra Pradesh
 
ఏపీలోని బాపట్ల జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేయాలంటే... ముందు ఆ దారిలోని అడ్డంకులను తొలగించి, కాంక్రీట్ చేస్తారు. అయితే, బాపట్ల జిల్లా దేశాయిపేటలో ఓ కారు రోడ్డుకు ఆనుకుని నిలిపి ఉండగానే, సిమెంట్ రోడ్డు వేసేశారు. 

ఎందుకిలా కారును తీయకుండా రోడ్డు వేశారు అని పంచాయతీ సిబ్బందిని అడిగితే... సిమెంట్ రోడ్డు వేస్తున్నందున కారు తీయాలని ఆ కారు యజమానికి చెప్పామని, కానీ అతడు తాము చెప్పింది వినిపించుకోకుండా ఇంటికి తలుపులు వేసి వెళ్లిపోయాడని వెల్లడించారు. దాంతో కాంట్రాక్టర్ కారు తీయకుండానే రోడ్డుపై కాంక్రీట్ వేసుకుంటూ వచ్చారని పంచాయతీ సిబ్బంది వివరించారు. 

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 
Car Owner
Bapatla District
Desaipeta
Andhra Pradesh
Cement Road
Viral Video
Road Construction
Unusual Incident
AP Road News

More Telugu News