Airbus A320 House: పాత ఎయిర్ బ‌స్ 'ఏ-320'తో ల‌గ్జ‌రీ ఇల్లు... ఇదిగో వీడియో!

Luxury Home Made From Old Airbus A320 Watch the Viral Video
   
ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎంతో శ్రమిస్తుంటారు. అయితే, ప్రస్తుతం ఇళ్ల ధరలు, భూమి ధరలు చుక్కలనంటుతున్నాయి. మరోవైపు నిర్మాణ వ్యయం కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవ‌డం అంత ఈజీ కాదు. అయితే, కొంత‌మంది సొంతిల్లు క‌ట్టుకోవ‌డానికి కాస్తంత భిన్నంగా ఆలోచిస్తుంటారు. ఇలాంటి కోవ‌కు చెందినదే ఇక్య‌డ మ‌నం చెప్పుకోబోయే ఈ ఫ్యామిలీ. ఏకంగా పాత ఎయిర్ బ‌స్‌ ఏ-320 విమానాన్ని కొనుగోలు చేసి, దాన్నే ల‌గ్జ‌రీ ఇల్లుగా మార్చేసిందా కుటుంబం. 

విలాస‌వంత‌మైన ల‌గ్జ‌రీ అపార్ట్‌మెంట్‌లో ఉండాల్సిన సౌక‌ర్యాలు అన్నీ ఈ ఇంట్లో ఉండ‌డం విశేషం. ఈ ఎయిర్ బ‌స్ ఇంట్లో కిచెన్‌, బెడ్ రూమ్‌, మాస్ట‌ర్ బెడ్ రూమ్‌, ఆఫీస్ రూమ్‌, బెడీ కాట్ ఇలా అన్ని ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు కొంద‌రు సూప‌ర్ ఐడియా అని మెచ్చుకుంటే... మ‌రికొంద‌రు పాత విమానం కొనుగోలు చేసి, ఇంటిని నిర్మించుకునే బ‌దులు అదే డ‌బ్బుతో మంచి క‌ల‌ల సౌధాన్ని నిర్మించుకోవ‌చ్చ‌ని కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా, ఈ వైర‌ల్ అవుతున్న వీడియోలోని ఇంటిని యూకేకి చెందిన  వారు నిర్మించినట్టు తెలుస్తోంది. వీరు ర‌కర‌కాల ఆకృతుల‌లో ప్ర‌జ‌ల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా ఇళ్ల‌ను నిర్మించి ఇస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ ఎయిర్ బ‌స్ ఏ-320 ఇంటి నిర్మాణం జ‌రిగిన‌ట్లు స‌మాచారం.  
Airbus A320 House
Luxury Home
Unique House Design
Airplane Conversion
Viral Video
UK Home Builders
Sustainable House
Recycled Materials
Innovative Architecture
House from Airplane

More Telugu News