రేవంత్ కు ప్రైవేట్ సైన్యంలా పని చేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుంది: కేటీఆర్
- రేవంత్ కారణంగా సీఎస్, ఇతర అధికారులు బలవుతున్నారన్న కేటీఆర్
- ఇతర అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచన
- కొందరు పోలీసు అధికారులు ఇష్టానుసారం కేసులు పెడుతున్నారని మండిపాటు
కొందరు పోలీసులు రేవంత్ రెడ్డికి సైన్యంలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇష్టానుసారం కేసులు పెడుతున్నారని... అలాంటి అధికారులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డికి ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు ఎండగట్టిందని తెలిపారు.