హైదరాబాద్ వ్యాపారికి బుకీలతో సంబంధాలు.. జాగ్రత్త.. ఆటగాళ్లను హెచ్చరించిన బీసీసీఐ

BCCI Warns of Hyderabad Businessmans Links to Bookies
            
క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లకు బీసీసీఐలోని యాంటీ కరప్షన్ సెక్యూరిటీ యూనిట్ (ఏసీఎస్‌యూ) హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి బుకీతో సంబంధాలు ఉన్నాయని, అతడితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ వ్యాపారి చట్ట వ్యతిరేక పనులు చేసేలా వ్యక్తులను ఒత్తిడికి గురిచేస్తున్నాడని పేర్కొంది. 

ఐపీఎల్‌లోని వ్యక్తులతో స్నేహం చేసేందుకు, సంబంధాలు పెట్టుకోవడానికి అతడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. ఖరీదైన బహుమతులు, నగలు ఇవ్వడం ద్వారా ఇప్పటికే అతడు కొంతమందితో పరిచయం పెంచుకున్నాడని, కాబట్టి ఆ వ్యక్తి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అభిమాని వేషంలో మ్యాచ్‌లోనూ, జట్లు బస చేసే హోటళ్లలోనూ కనిపిస్తున్నాడని తెలిపింది. బీసీసీఐ ప్రకటనతో ఐపీఎల్‌లో కలకలం రేగింది. ఆ వ్యాపారి ఎవరన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
Go Back to Shorts
Hyderabad Businessman
BCCI Warning
IPL
Bookies
Anti-Corruption Unit
Cricket
Match Fixing
Expensive Gifts
Social Media
Investigations

More Telugu News