కేకేఆర్‌పై అదిరే విజయం తర్వాత చాహల్‌ను హత్తుకున్న నటి ప్రీతి జింటా.. వీడియో ఇదిగో!
- 112 పరుగులు ఛేదించలేకపోయిన కోల్‌కతా
- 95 పరుగులకే కేకేఆర్ ఆలౌట్
- నాలుగు వికెట్లు తీసి కేకేఆర్ పతనాన్ని శాసించిన చాహల్
ఈ మ్యాచ్‌కు ముందు వరకు రెండు వికెట్లు మాత్రమే పడగొట్టిన చాహల్.. కోల్‌కతాతో మ్యాచ్‌లో 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఒకానొక సమయంలో 9 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళ్తున్నట్టు కనిపించిన కోల్‌కతా.. 15.1 ఓవర్లలో 95 పరుగులకు ఆలౌట్ అయింది.
అనూహ్యంగా అందిన విజయంతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రీతి జింటా సంతోషం పట్టలేకపోయింది. చాహల్‌ను హత్తుకుని తన సంతోషాన్ని పంచుకుంది. చాహల్‌తో కాసేపు ముచ్చటించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.