తమ్ముడి దొంగతనం.. అవమానభారంతో ఇద్దరు పిల్లలతో అక్క ఆత్మహత్య
- కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో ఘటన
- బావ మొబైల్ ఫోన్, నగదు చోరీ చేసిన బావమరిది
- భార్యతో గొడవ పడిన భర్త
- అవమానం భరించలేక పిల్లలతో కలిసి బావిలో దూకిన భార్య
అనంతరం మహేశ్ తన భార్య సుశీలతోనూ గొడవపడ్డాడు. ఆమె తమ్ముడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అవమానభారంతో రగిలిపోయిన సుశీల ఆదివారం రాత్రి ఇంటి నుంచి ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లింది. పుట్టింటికి వెళ్లి ఉంటుందని మహేశ్ భావించాడు. అయితే, సోమవారం గ్రామంలోని ఓ బావి వద్ద సుశీల చెప్పులు, తాళిబొట్టు, ఇతర వస్తువులను గ్రామస్థులు గుర్తించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో గాలించారు. సుశీల, పిల్లలు దివ్య (11), చంద్రు (8) మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.