మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు
ఇక మద్యం కుంభకోణంపై సిట్ ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోమవారం సోదాలు చేసింది. హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో 50 మంది సిట్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి మూడుసార్లు అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు.
ఆయనను విచారిస్తే ఈ స్కామ్‌కు సంబంధించి కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది.