Harish Rao: ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటన... రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం

ICICI Bank Statement Fuels Harish Raos Attack on Revanth Reddy Govt
  • కంచ గచ్చిబౌలి భూములను తనఖా పెట్టినట్లు ప్రభుత్వం చెప్పిందన్న హరీశ్ రావు
  • కానీ తనఖా పెట్టుకోలేదని ఐసీఐసీఐ ప్రకటన విడుదల చేసిందని వెల్లడి
  • రేవంత్ రెడ్డి తన బ్రోకర్ కంపెనీకి తనఖా పెట్టారా అని నిలదీత
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ప్రభుత్వం ఈ భూములను తనఖా పెట్టి రుణం పొందినట్లు చెప్పిందని, అయితే ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం తాము తనఖా పెట్టుకోలేదని ప్రకటన విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బ్రోకర్ కంపెనీలకు తనఖా పెట్టారా? 400 ఎకరాల తనఖా విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏమిటి? అని హరీశ్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఐసీఐసీఐ ప్రకటన ఇదీ

తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)కి ఎటువంటి తనఖా రుణాన్ని అందించలేదని ఐసీఐసీఐ బ్యాంకు ఒక ప్రకటనను విడుదల చేసింది. బాండ్ల జారీకి సంబంధించి తమ వద్ద ఎలాంటి స్థలాన్ని తనఖా పెట్టలేదని కూడా తెలిపింది. బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపునకు సంబంధించి టీఎస్ఐఐసీకి అకౌంటు బ్యాంకుగా మాత్రమే వ్యవహరించామని పేర్కొంది.
Harish Rao
Revanth Reddy
ICICI Bank
Telangana Government
Gachibowli land deal
TSIIC
mortgage loan
Telangana Politics
Land Scam

More Telugu News