Gujarat Titans: లక్నోతో గుజరాత్ టైటాన్స్ అమీతుమీ... టాస్ అప్డేట్ ఇదిగో!

నేడు వీకెండ్ కావడంతో ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఆడుతున్నాయి. లక్నోలోని వాజ్ పేయి స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. మాంచి ఫామ్ లో ఉన్న గుజరాత్ టీమ్ ను లక్నో సొంతగడ్డపై ఎలా నిలువరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం గుజరాత్ టీమ్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. శుభ్ మాన్ గిల్ నాయకత్వంలోని టైటాన్స్ 5 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు నమోదు చేసింది. మరోవైపు, లక్నో సూపర్ జెయింట్స్ 5 మ్యాచ్ ల్లో మూడింట గెలిచి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది.