Hyderabad weather: హైదరాబాద్ సహా తెలంగాణలో చల్లబడిన వాతావరణం.. పలుచోట్ల వర్షం

Hyderabad  Telangana Witness Cooler Weather Rainfall in Several Areas
  • మియాపూర్, గచ్చిబౌలి, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయం
  • క్యుములోనింబస్ ప్రభావంతో వర్షాలు పడుతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడి
  • తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడి
హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచే వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం చిరుజల్లు కురిసింది. మియాపూర్, గచ్చిబౌలి, మేడ్చల్, గాగిల్లాపూర్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, జుబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో రానున్న 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు తదితర జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Hyderabad weather
Telangana weather
rain in Hyderabad
weather forecast Hyderabad
Telangana rainfall
heavy rain
weather update
hailstorm
yellow alert
India weather

More Telugu News