జగన్ భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అరెస్ట్
- టీడీపీ అధిష్ఠానం ఆదేశాలతో కిరణ్ పై పోలీసులకు ఫిర్యాదు
- లొకేషన్ ఆధారంగా ఇబ్రహీంపట్నంలో కిరణ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
- దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదన్న కిరణ్
పోలీసుల గుడ్డలు ఊడదీస్తానంటూ రామగిరి పర్యటన సందర్భంగా జగన్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, భారతి గురించి చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నానని అన్నారు. ఎలాంటి దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదని... క్షణికావేశంలో మాత్రమే చేశానని చెప్పారు.