Revanth Reddy: చిన్నారుల‌తో క‌లిసి స‌ర‌దాగా ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్‌... వీడియో ఇదిగో!

Telangana CM Revanth Reddy Inaugurates Young India Police School
  • యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన‌ సీఎం
  • రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో స్కూల్ నిర్మాణం
  • కాసేపు పిల్ల‌ల‌తో కలిసి స‌ర‌దాగా గ్రౌండ్‌లో సీఎం ఫుట్‌బాల్ ఆడిన వైనం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో ఈ స్కూల్‌ను నిర్మించారు. గురువారం మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిలతో కలిసి పాఠశాలను ముఖ్య‌మంత్రి ప్రారంభించారు. అనంతరం క్లాస్ రూంలను పరిశీలించారు. ఆ త‌ర్వాత ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను ప్రారంభించి... కాసేపు చిన్నారుల‌తో కలిసి స‌ర‌దాగా గ్రౌండ్‌లో సీఎం ఫుట్‌బాల్ ఆడారు. 

Revanth Reddy
Telangana CM
Young India Police School
Manchiryal
Rangareddy district
Greyhounds campus
Football
School inauguration
Telangana Politics

More Telugu News