Amit Shah: చిన్నప్పుడు అమిత్ షా ముద్దుపేరు ఏమిటో తెలుసా?

- తాను శరద్ పూర్ణిమ రోజున పుట్టానన్న అమిత్ షా
- తనను చిన్నప్పుడు పూనమ్ అని పిలిచేవారని వెల్లడి
- గ్రామాల్లో పుట్టినవారికి ఇది సర్వసాధారణ విషయమన్న అమిత్ షా
మనలో చాలా మందికి చిన్నప్పుడు ముద్దుపేర్లు ఉండే ఉంటాయ్. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా చిన్నప్పుడు ముద్దుపేరుతో పిలిచేవారట. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... చిన్నప్పుడు తనను 'పూనమ్' అని పిలిచే వారని చెప్పారు. ఐదేళ్లు నిండిన తర్వాత తనకు పేరు పెట్టాలనుకున్నారని... తాను శరద్ పూర్ణిమ రోజున పుట్టానని... అందుకే తనను పూనమ్ అని పిలిచేవారని వెల్లడించారు. గ్రామాల్లో పుట్టిన వారికి ఇది సర్వసాధారణ విషయమేనని చెప్పారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాని ఎంపిక విభిన్నంగా ఉంటుందని... బీజేపీలో అయితే మోదీ అత్యున్నత నాయకుడు కాబట్టి ప్రధాని అయ్యారని అన్నారు. ప్రస్తుత వక్ఫ్ బిల్లు ముస్లిం సమాజంలోని కొందరికి మాత్రమే ఇష్టం లేదని చెప్పారు. వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్ సభలో రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఓటింగ్ లో పాల్గొనకుండా ఎందుకు తప్పించుకున్నారని అడిగారు. ముంబై దాడుల నిందితుడు తహవూర్ రాణాను భారత్ కు అమెరికా అప్పగించడం ప్రధాని మోదీ సాధించిన గొప్ప దౌత్య విజయమని చెప్పారు.