అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి.. ఇన్ స్టా కలిపింది ఈ ఇద్దరినీ..!
- ఆంధ్రా యువకుడిని ప్రేమించిన అమెరికా అమ్మాయి
- ప్రియుడితో పెళ్లి కోసం తల్లితో కలిసి ఏపీకి వచ్చిన వైనం
- త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నామంటూ ఇన్ స్టాలో వీడియో
అమెరికాకు చెందిన జాక్లిన్ ఫొరెరోకు ఇన్ స్టాలో ఆంధ్రా యువకుడు చందన్ తో పరిచయమైంది. తొలుత సాధారణంగా మొదలైన చాటింగ్ రోజులు గడుస్తున్న కొద్దీ స్నేహంగా, ప్రేమగా మారింది. పద్నాలుగు నెలల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చందన్ కంటే ఫొరెరో తొమ్మిదేళ్లు పెద్ద అయినా అదేమీ అడ్డంకి కాదని భావించినట్లు ఇద్దరూ తెలిపారు. చందన్ కు క్రైస్తవ మతంపై ఉన్న విశ్వాసం, నాలెడ్జ్ తనకు ఎంతగానో నచ్చాయని ఫొరెరో చెప్పారు. అదే తమ మధ్య పరిచయం పెరగడానికి కారణమైందన్నారు. కాగా, ఫొరెరో ఇన్ స్టాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.