హైదరాబాద్ జలమండలి కీలక నిర్ణయం... నల్లాలకు మోటార్లు బిగిస్తే జరిమానా, కనెక్షన్ కట్
- మోటార్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించిన జలమండలి ఎండీ
- ఏప్రిల్ 15వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు సూచన
- 'మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్' పేరుతో ప్రత్యేక ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలన్న ఎండీ
హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు సూచించారు. 'మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్' పేరుతో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. వేసవి కాలం రావడంతో నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు జలమండలి ఈ నిర్ణయం తీసుకుంది.