Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయం సరికొత్త రికార్డు

Hyderabad Airport Records Highest Ever Passenger Traffic
  • ప్రయాణికుల రాకపోకల్లో గణనీయమైన వృద్ధి సాధించిన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్
  • గత ఆర్థిక సంవత్సరంలో 2.13 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు
  • ఒక నెలలో ప్రయాణించే వారి సంఖ్య కూడా ఎక్కువే
  • మెట్రో నగరాలు చెన్నై, కోల్‌కతాను అధిగమించిన రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రయాణికుల రాకపోకల్లో గణనీయమైన వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 15.20 శాతం వృద్ధి సాధించి దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలను అధిగమించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏకంగా 2.13 కోట్ల మంది ప్రయాణించారు. ఈ  రద్దీ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్య మూడు కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లోనూ ఈ ఎయిర్‌పోర్టు మరో రికార్డు నెలకొల్పింది. ఇక్కడి నుంచి ఒక నెలలో ప్రయాణించే వారి సంఖ్య గరిష్ఠంగా 20 లక్షలే కాగా, ఈసారి మాత్రం ఈ మూడు నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఈ క్రమంలో చెన్నై, కోల్‌కతాలను అధిగమించింది. అలాగే, హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి నెలకు 93 వేలమంది, దోహాకు 42 వేల మంది, అబుధాబికి 38 వేల మంది, జెడ్డాకు 31 వేల మంది, సింగపూర్‌కు 31 వేల మంది రాకపోకలు సాగిస్తున్నట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
Shamshabad Airport
Hyderabad Airport
Rajiv Gandhi International Airport
Passenger Traffic
India Airport Growth
Air Travel
Domestic Flights
International Flights
Record Passenger Numbers
Airport Traffic

More Telugu News