LPG Price Hike: సామాన్యుల‌కు షాక్‌... భారీగా గ్యాస్ ధ‌రల పెంపు!

LPG Price Hike Cooking Gas Cylinder Costs Increased by 50
  • వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ. 50 పెంచిన కేంద్రం
  • ఈ మేర‌కు కేంద్ర‌మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరి ప్ర‌క‌ట‌న‌
  • ఉజ్వల ప‌థ‌క ల‌బ్ధిదారులు, జనరల్ కేటగిరీ వినియోగదారులు ఇద్ద‌రికీ ఈ ధ‌ర‌లు వ‌ర్తింపు 
  • రేప‌టి నుంచే కొత్త ధ‌ర‌లు అమ‌ల్లోకి
వంట గ్యాస్ ధరను పంపిణీ సంస్థలు సిలిండర్‌కు రూ.50 పెంచాయని కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరి సోమవారం వెల్ల‌డించారు. జనరల్ కేటగిరీ వినియోగదారులతో పాటు ఉజ్వల ప‌థ‌క ల‌బ్ధిదారుల‌కు కూడా ఈ పెంపు వ‌ర్తిస్తుంద‌న్నారు. రేప‌టి నుంచే కొత్త ధ‌ర‌లు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని మంత్రి తెలిపారు.

ఈ పెంపుతో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర సాధారణ వినియోగదారులకు రూ. 803 నుంచి రూ. 853కు, ఉజ్వ‌ల్ సిలిండ‌ర్‌ రూ. 503 నుంచి రూ. 553కు చేర‌నుంది. అటు... పెట్రోల్‌, డీజిల్‌పై లీట‌ర్‌కు రూ. 2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచ‌గా, ఆ భారాన్ని చ‌మురు కంపెనీలే భ‌రించ‌నున్నాయి. 
LPG Price Hike
Hardeep Singh Puri
Cooking Gas Price
India LPG Cylinder Price
Ujjwala Yojana
Domestic LPG Cylinder
Fuel Price Increase
LPG Price
Central Minister

More Telugu News