Hyderabad: గ‌చ్చిబౌలిలో దారుణ‌ ఘ‌ట‌న‌.. గ‌ర్భ‌వ‌తైన భార్య‌పై న‌డిరోడ్డుపై ఇటుక‌తో దాడి!

Pregnant Wife Attacked with Brick in Gachibowli Husband Arrested
    
గ‌ర్భ‌వ‌తైన‌ భార్య‌పై భ‌ర్త దాడి చేసిన దారుణ‌ ఘ‌ట‌న హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. న‌డిరోడ్డుపై సిమెంట్ ఇటుక‌తో దాడి చేయ‌డంతో తీవ్ర‌గాయాల‌పాలైన ఆమె ప్ర‌స్తుతం ప్రాణాపాయ‌స్థితిలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుంది. 

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... హ‌ఫీజ్‌పేట ఆదిత్యన‌గ‌ర్‌లో ఉండే మ‌హ్మ‌ద్ బ‌స్‌ర‌త్ (32)... 2023 ప్రారంభంలో అజ్‌మేర్ ద‌ర్గాకు వెళ్లాడు. బ‌స్సు ప్ర‌యాణంలో బెంగాల్‌కు చెందిన ష‌బానా ప‌ర్వీన్ (22)తో అత‌నికి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్త త‌ర్వాత ప్రేమ‌గా మారింది. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో కోల్‌కతాలో ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. 

అనంత‌రం బ‌స్‌ర‌త్ భార్య‌ను హ‌ఫీజ్‌పేటకు తీసుకొచ్చాడు. ఈ క్ర‌మంలో కుటుంబ‌ విభేదాల కార‌ణంగా భార్య ఒత్తిడితో వేరే కాపురం పెట్టారు. ఇటీవ‌ల ప‌ర్వీన్ గ‌ర్భం దాల్చ‌డంతో ఆమెకు ఎక్కువ‌గా వాంతులు అవుతున్నాయి. దాంతో మార్చి 29న భార్య‌ను ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో అడ్మిట్ చేశాడు. ఆ త‌ర్వాత ఆమె ఆరోగ్యం కొంత మెరుగుప‌డ‌టంతో ఏప్రిల్ 1న రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో డిశ్చార్జి అయింది. అయితే, ఇంటికి తిరిగొచ్చే క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దాంతో భార్య‌ను బ‌స్‌ర‌త్ కొట్ట‌డంతో కింద ప‌డింది. 

ఆ తర్వాత పక్క‌నే ఉన్న‌ సిమెంట్ ఇటుక‌లు తీసుకొని బ‌స్‌ర‌త్ ఆమె త‌ల‌పై ప‌లుమార్లు దాడి చేశాడు. దీంతో పర్వీన్ స్పృహ త‌ప్పగా.. చ‌నిపోయింద‌నుకుని బ‌స్‌ర‌త్ అక్క‌డి నుంచి పారిపోయాడు. పోలీసులు వ‌చ్చి ఆమెను నిమ్స్‌కు త‌ర‌లించారు. త‌ల‌కు బ‌ల‌మైన గాయం కార‌ణంగా ఆమె కోమాలోకి వెళ్లిన‌ట్లు పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం ఆమో ఆరోగ్య‌ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌న్నారు. నిందితుడు బ‌స్‌ర‌త్‌ను పోలీసులు ఈ నెల 3న‌ అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు పంపారు.
Hyderabad
Mohammed Basrath
Shabana Parveen
Gachibowli
Domestic Violence
Pregnant Wife Attacked
Brick Attack
Crime News
Telangana
India

More Telugu News