Mohammed Askar Ali: వక్ఫ్ వివాదం... బీజేపీ నేత ఇంటికి నిప్పు

- రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు
- వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు
- మణిపూర్ బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడి నివాసంపై ముస్లింల దాడి
వక్ఫ్ సవరణ బిల్లు చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో బిల్లు చట్టంగా మారింది. మరోవైపు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మొహమ్మద్ అస్కర్ అలీ ఇంటిపై దాడి జరిగింది. దాదాపు 8 వేల మందితో కూడిన గుంపు ఆయన ఇంటికి నిప్పు పెట్టింది. దీంతో, ఆయనకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
ఈ దాడితో పోలీసులు అలర్ట్ అయ్యారు. అస్కర్ అలీ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముస్లిం సమాజానికి అస్కర్ క్షమాపణ చెప్పారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని హెచ్చరించారు. తుపాకులు, కత్తులు, కర్రలు, రాళ్లు వంటి వస్తువులు దగ్గర ఉంచుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు.