Ajay Jain: ఏపీలో టూరిజం ప్రాజెక్టుల ప్రతిపాదనలపై సమీక్షకు కమిటీ ఏర్పాటు

Andhra Pradesh Forms Committee to Review Tourism Project Proposals
  • ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
  • ఏపీ టూరిజం అథారిటీ సీఈవో చైర్మన్‌గా ఎనిమిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్
  • ఆర్ధిక శాఖలోని పీపీపీ నిపుణుడు షాలెం రాజుకు కమిటీలో చోటు 
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ టూరిజం పాలసీ 2024-25లో భాగంగా రాష్ట్రానికి వచ్చే పర్యాటక ప్రాజెక్టుల ప్రతిపాదనలను సమీక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ టూరిజం అథారిటీ సీఈవో ఛైర్మన్‌గా ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక శాఖలోని పీపీపీ నిపుణుడు షాలెం రాజును ఈ కమిటీలో సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది.

ఈ కమిటీ 2024-25 పర్యాటక పాలసీలో భాగంగా పెట్టుబడి ఆధారంగా భూ కేటాయింపులు, ఇతర ప్రోత్సాహకాలను సమీక్షించనుంది. పీపీపీ కింద పర్యాటక ప్రాజెక్టులను చేపట్టాలని నూతన టూరిజం పాలసీలో ప్రభుత్వం పేర్కొంది.

ఈ ప్రాజెక్టులకు కేటాయించిన ప్రభుత్వ భూమి సద్వినియోగం అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఈ కమిటీపై ఉండనుంది. టూరిజం ప్రాజెక్టుల పెట్టుబడి ప్రతిపాదనలను సమీక్షించి ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. 

             
Ajay Jain
Andhra Pradesh Tourism
AP Tourism Policy 2024-25
Tourism Projects
PPP Projects
Investment Proposals
Land Allocation
Committee
Tourism Authority CEO
Shalem Raju

More Telugu News