Indian killed in Canada: కెనడాలో భారతీయుడి దారుణహత్య

Indian Man Stabbed to Death in Canada
         
కెనడాలో మరో భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఒట్టావా సమీపంలోని రాక్‌లాండ్ ప్రాంతంలో ఓ భారతీయుడు కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయినట్టు భారత రాయబార కార్యాలయం తెలిపింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. మృతుడి సన్నిహితులు, కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపింది. స్థానిక కమ్యూనిటీతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు వివరించింది.

కాగా, మృతుడి పేరు, ఇతర వివరాలు లభ్యం కాలేదు. స్థానిక కాలమానం ప్రకారం నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా పేర్కొంది. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Indian killed in Canada
Ottawa murder
Rockland Canada
Indian Canadian murder
Canada crime
stabbing incident
investigation underway
Indian embassy Canada

More Telugu News