Pawan Kalyan: శ్రీరామనవమికి ఒక రోజు ముందుగానే... ఈరోజు భద్రాచలంకు వెళుతున్న పవన్ కల్యాణ్

- రేపు భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు
- ఏపీ ప్రభుత్వం తరపున స్వామివారికి ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్న పవన్
- రేపు భద్రాచలం వెళుతున్న రేవంత్ రెడ్డి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు భద్రాచలంకు వెళుతున్నారు. రేపు భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. పండుగరోజుకు ఒక్క రోజు ముందుగానే పవన్ భద్రాచలంకు వెళుతున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను సీతారాముల కళ్యాణానికి పవన్ సమర్పించనున్నారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో ఆయన భద్రాచలంకు బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు ఆయన భద్రాచలం చేరుకుంటారు. ఈ రాత్రికి భద్రాచలంలోనే ఆయన బస చేస్తారు.
రేపు సీతారాముల కళ్యాణానికి పవన్ హాజరవుతారు. ఈ సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. రేపు సాయంత్రం 5 గంటలకు భద్రాచలం నుంచి తిరుగుపయనమవుతారు. రేపు రాత్రి 10 గంటలకు హైదరాబాద్ లోని నివాసానికి చేరుకుంటారు. మరోవైపు, రేపు స్వామివారి కళ్యాణానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు భద్రాచలం వెళ్లనున్నారు.