Amaravati Street Art Festival: రాజమండ్రిలో అద్భుతంగా అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం

Amaravati Street Art Festival in Rajamahendravaram
  • ప్రారంభించిన డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణరాజు, సాంస్కృతిక సంఘం చైర్ పర్సన్ తేజస్వి పోడపాటి
  • కార్యక్రమంలో పాల్గొన్న 600 మందికిపైగా కళాకారులు
  • ప్రజలను అలరించిన కళారూపాలు
ఈ సంవత్సరం అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమం రాజమండ్రిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బాలరామకృష్ణ, ఏపీ సాంస్కృతిక సంఘం చైర్‌పర్సన్ తేజస్వి పోడపాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దేశం నలుమూలల నుంచి 600 మందికి పైగా కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తమ అద్భుతమైన కళా ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. చిత్రలేఖనాలు, పట చిత్రాలు, మట్టి బొమ్మలు, సాంకేతిక కళారూపాలు వంటి అనేక కళారూపాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

కళల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడమే కాకుండా, యువ కళాకారులకు ప్రోత్సాహం కల్పించే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర సాంస్కృతిక ప్రాధాన్యతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర సాంస్కృతిక సంఘం చైర్‌పర్సన్ తేజస్వి అన్నారు. 
Amaravati Street Art Festival
Rajamahendravaram
Andhra Pradesh
Tejaswi Podapati
Raghurama Krishnaraju
Kandula Durga Prasad
Adireddy Vasu
Bathula Balarama Krishna
Indian Art
Street Art

More Telugu News