Revanth Reddy: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Discusses Gachibowli Land Issue
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని భూముల వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించారు. సుమారు 400 ఎకరాల భూములను పరిరక్షించాలని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, హెచ్‌సీయూ విద్యార్థులు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులు హాజరయ్యారు. వారి నుంచి ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వన ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిని అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని ఫౌండేషన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. రేపు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
Go Back to Shorts
Revanth Reddy
Gachibowli Land Issue
Telangana
High Court
Van Foundation
Public Interest Litigation
400 Acres Land
Ministerial Meeting
Land Conservation
HCU Students Protest

More Telugu News