ఎంఎంటీఎస్ బాధితురాలిని పరామర్శించిన బండి సంజయ్.. రేవంత్ పై విమర్శలు
- ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం
- యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
- ఇంతవరకు నిందితుడిని పట్టుకోలేదంటూ బండి సంజయ్ మండిపాటు
అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు నిందితుడిని పట్టుకోలేదని విమర్శించారు. నిందితుడిని పట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని... పోలీసులేమో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నిందితుడిని పట్టుకున్నామని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చెప్పడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని అన్నారు.