గుజరాత్‌లో ఏసీ హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుజరాత్‌లో ఏసీ హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

Gujarat Traffic Police Use AC Helmets
  • రాష్ట్రంలోని వడోదర నగరంలో ఏసీ హెల్మెంట్లు ధరించిన పోలీసులు
  • ఎండ వేడి తాపం నుంచి రక్షించుకోవడానికి వడోదర ట్రాఫిక్ విభాగం వినూత్న ఆలోచన
  • 500 మంది ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు అందజేత
వేసవి కాలంలో వేడి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు గుజరాత్‌లోని ట్రాఫిక్ విభాగం వినూత్న ఆలోచన చేసింది. సూర్యుడి తాపం నుంచి రక్షణ పొందేందుకు వడోదరలోని ట్రాఫిక్ పోలీసులు ఏసీ హెల్మెట్లు వినియోగిస్తున్నారు. ఎండాకాలం కాసేపు బయటకు వెళితేనే వేడికి అల్లాడిపోతాం. ఎక్కువసేపు ఎండలో ఉండాలంటే భయపడిపోతాం.

అలాంటిది ట్రాఫిక్ సిబ్బంది గంటలకొద్ది ఎండ వేడిని తట్టుకుంటూ తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వడోదర ట్రాఫిక్ విభాగం వినూత్నంగా ఆలోచించి ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లను అందించింది. నగరంలోని 500 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు అందజేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు మండుటెండల్లోనూ ప్రశాంతంగా విధులు నిర్వహిస్తున్నారు.
Advertisement
Gujarat Traffic Police
AC Helmets
Vadodara
Summer Heat
Traffic Officers
Heatstroke Prevention
Innovative Solution
Police Equipment
Gujarat Police

More Telugu News