Vijay Deverakonda: ఎన్టీఆర్ అన్నను ఎక్కువసార్లు మీట్ అవ్వకపోయినా ఓకే చెప్పడం ప్రత్యేకం అనిపించింది: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda on NTRs Special Voiceover for King of the Hill Teaser
  • విజయ్ దేవరకొండ మూవీ కింగ్‌డమ్ టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్
  • దర్శకుడు లేరని చెప్పినా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అద్భుతంగా ఇచ్చారన్న విజయ్
  • ఇది తనకు ఎంతో ప్రత్యేకం అనిపించిందని వెల్లడి
ఎన్టీఆర్‌ను అంతకు ముందు తాను ఎక్కువసార్లు కలవకపోయినా, తమ టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ప్రత్యేకమని హీరో విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్నసూరి తెరకెక్కిస్తున్న 'కింగ్ డమ్' టీజర్‌కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ టీజర్ విడుదల కాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

టీజర్ కోసం వాయిస్ ఓవర్ రాసే సమయంలో ఎన్టీఆర్‌ అన్నతో చెప్పిస్తే బాగుంటుందని అనుకున్నామని, ఈ విషయం ఆయనను కలిసి చెప్పగా, కాసేపు ముచ్చటించిన తర్వాత అదే రోజు సాయంత్రం చేద్దామని అన్నారని విజయ్ తెలిపారు. దర్శకుడు చెన్నైలో ఉన్నారని, టీజర్‌కు సంబంధించిన మ్యూజిక్ వర్క్‌లో బిజీగా ఉన్నారని చెప్పగా, "ఏం ఫర్వాలేదు. నువ్వు ఉన్నావుగా" అని ఎన్టీఆర్ అన్నారన్నారు. ఆ డైలాగ్స్ ఆయనకు ఎంతగానో నచ్చాయని, అద్భుతంగా వాయిస్ ఓవర్ ఇచ్చారని అన్నారు. ఇది తనకు ఎంతో ప్రత్యేకమనిపించిందని ఆయన అన్నారు. 
Vijay Deverakonda
NTR
King of the Hill
Movie Teaser
Voice Over
Gautam Tinnanuri
Telugu Cinema
Tollywood
Nandamuri Taraka Rama Rao Jr
Film Industry

More Telugu News