Flipkart: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లలో తనిఖీలు.. వేలాది నకిలీ వస్తువుల సీజ్

Flipkart  Amazon Raided Thousands of Fake Products Seized in Delhi

  • ఢిల్లీలోని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లపై బీఐఎస్ దాడులు
  • డిస్పాచ్‌కు సిద్ధంగా ఉన్న నాసిరకం వస్తువుల సీజ్
  • నాణ్యత లేని ఉత్పత్తుల్లో గీజర్లు, మిక్సీలు, ఎలక్ట్రికల్ పరికరాలు
  • గతవారం తమిళనాడులో 3 వేల ఉత్పత్తుల సీజ్

ఈకామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లపై ఢిల్లీ బ్రాంచ్‌కు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జరిపిన దాడుల్లో పలు బ్రాండ్లకు చెందిన నకిలీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అమెజాన్ సెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గోడౌన్‌లో ఈ నెల 19న 15 గంటలపాటు కొనసాగిన ఈ తనిఖీల్లో నాణ్యత లేని వేలాది ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు. వీటిలో గీజర్లు, మిక్సీలు, పలు రకాల ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి. వీటికి ఐఎస్ఐ గుర్తింపు లేదని,  నకిలీ లేబుళ్లతో ఉన్నాయని అధికారులు తాజాగా వెల్లడించారు.

అలాగే, ఢిల్లీలోని త్రినగర్‌లో ఉన్న ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఇన్‌స్టాకార్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ గోడౌన్‌లో నిర్వహించిన తనిఖీల్లోనూ నాసిరకం ఉత్పత్తులను గుర్తించారు. డిస్పాచ్‌కు రెడీగా ఉన్న స్పోర్ట్స్ ఫుట్‌వేర్‌లను సీజ్ చేశారు. వాటిపై తయారీ తేదీ కానీ, ఐఎస్ఐ ముద్ర కానీ లేదని అధికారులు తెలిపారు. రూ. 6 లక్షల విలువైన 590 జతల స్పోర్ట్స్ షూస్‌ను సీజ్ చేశారు. కాగా, గతవారం తమిళనాడులో 3 వేల ఉత్పత్తులను బీఐఎస్ సీజ్ చేసింది.

Flipkart
Amazon
Bureau of Indian Standards
BIS
Fake Products
Counterfeit Goods
Seized Goods
Delhi Raids
E-commerce
India
  • Loading...

More Telugu News