ఒకేసారి ఇద్దరు యువతులతో ప్రేమాయణం.. ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

Man Marries Two Women Simultaneously in India
పక్కపక్క గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులను ఒకేసారి ప్రేమించిన యువకుడు.. వారిద్దరినీ ఒకేసారి వివాహం చేసుకున్నాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లింగాపూర్ మండలం ఘుమనూర్ గ్రామానికి చెందిన సూర్యదేవ్.. పక్కపక్క గ్రామాలకు చెందిన యువతులు లాల్‌దేవి, జల్కర్‌దేవిలను ఒకేసారి ప్రేమించాడు. కొంతకాలంగా ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. 

     
విషయం తెలిసిన గ్రామస్థులు, ఆదివాసీ పెద్దలు కలిసి ఇరు కుటుంబాలతోపాటు యువతులతోనూ మాట్లాడారు. యువతులు ఇద్దరూ సూర్యదేవ్‌ని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు. ముగ్గురం కలిసే జీవిస్తామని స్పష్టం చేశారు. దీంతో వారికి వివాహం చేయాలని నిర్ణయించారు. గురువారం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం వారి వివాహం ఘనంగా జరిపించారు.
Go Back to Shorts
Suryadev
Tribal Marriage
Kumram Bheem Asifabad
Love Triangle
Polygamy
India
Village Wedding
Lal Devi
Jalker Devi
Simultaneous Marriages

More Telugu News