Uttam Kumar Reddy: రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddys Key Announcement on Ration Cards
షార్ట్స్‌లో చూడండి
రేషన్ కార్డుదారులకు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త తెలిపారు. శుక్రవారం ఆయన హుజూర్ నగర్ లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో 85 శాతం జనాభాకు సన్నబియ్యం అందనున్నాయని ఆయన తెలిపారు. రేషన్ బియ్యాన్ని చాలా మంది ఉపయోగించుకోవడం లేదని, దొడ్డు బియ్యం తినలేక కొందరు బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సన్న బియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

రేషన్ షాపులో బియ్యంతో పాటు త్వరలో కందిపప్పు, ఉప్పు లాంటి ఇతర నిత్యావసర వస్తువులు ఇస్తామని తెలిపారు. అలానే రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. కొత్త రేషన్ కార్డులు ఎంత మందికి కావాలన్నా అర్హతను బట్టి అందిస్తామని వెల్లడించారు. రేషన్ కార్డు లేకపోయినా లబ్దిదారుల జాబితాలో పేరు ఉంటే బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. 
Go Back to Shorts
Uttam Kumar Reddy
Telangana Ration Cards
Ration Rice Scheme
Public Distribution System
PDS Telangana
Fine Rice Distribution
Telangana Minister
New Ration Cards
Essential Commodities
Ration Shops

More Telugu News