పాస్టర్ ప్రవీణ్ మరణంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
- ప్రమాదం కాదు పక్కా ప్లాన్ తో చేసిన హత్యేనని ఆరోపణలు
- ఘటనా స్థలంలో ఆధారాలు చాలా రుజువులు ఉన్నాయన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్
- ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన షర్మిల
ప్రవీణ్ మృతిపై నెలకొన్న అన్ని సందేహాలను నివృత్తి చేసేలా ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించి నిజానిజాలు వెలికితీయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ షర్మిల ట్వీట్ చేశారు. కాగా, హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు బైక్పై బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ దివాన్ చెరువు-కొంతమూరు హైవేపై అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే.