చెర్రీకి చిరు బ‌ర్త్‌డే విషెస్‌.. 'పెద్ది' గురించి ఏమ‌న్నారంటే..!

Chiranjeevis Birthday Greetings to Ram Charan
  • ఈరోజు రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే
  • 'ఎక్స్' వేదిక‌గా త‌న‌యుడికి బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన తండ్రి చిరంజీవి
  • చ‌ర‌ణ్ కొత్త మూవీ 'పెద్ది' ఫ‌స్ట్ లుక్‌పై కూడా చిరు కామెంట్
  • పోస్ట‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్ లుక్ చాలా అద్భుతంగా ఉంద‌ని కితాబు
  • ఇది సినీ అభిమానుల‌కు ఒక మంచి ట్రీట్ కానుంద‌న్న మెగాస్టార్‌
ఈరోజు రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా చెర్రీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయ‌న తండ్రి మెగాస్టార్ చిరంజీవి 'ఎక్స్' వేదిక‌గా ప్ర‌త్యేకంగా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. అలాగే ఈరోజు విడుద‌లైన చ‌ర‌ణ్ కొత్త మూవీ 'పెద్ది' ఫ‌స్ట్ లుక్‌పై కూడా చిరు కామెంట్ చేశారు. పోస్ట‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్ లుక్ చాలా అద్భుతంగా ఉంద‌ని, ఈ చిత్రం త‌ప్ప‌కుండా సినీ అభిమానుల‌కు ఒక మంచి ట్రీట్ కానుంద‌ని చిరంజీవి అన్నారు. 

"హ్యాపీ బ‌ర్త్‌డే మై డియ‌ర్ చ‌ర‌ణ్. పెద్ది చాలా ఇంటెన్స్‌గా క‌నిపిస్తోంది. నీలోని న‌టుడిని మ‌రో కొత్త కోణంలో ఇది ఆవిష్క‌రించ‌నుంది. సినిమా ప్రియులకు, అభిమానులకు ఇది ఒక విందుగా ఉంటుందని నేను క‌చ్చితంగా న‌మ్ముతున్నాను" అని చిరు ట్వీట్ చేశారు. 

కాగా, ఈరోజు విడుద‌లైన 'పెద్ది' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో గుబురు గ‌డ్డం, లాంగ్ హెయిర్‌తో చెర్రీ మ‌రోసారి ఇంటెన్స్ లుక్‌తో అద‌ర‌గొట్టారు. ఈ చిత్రంలో జాన్వీ క‌పూర్ క‌థానాయిక కాగా, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహమాన్ స్వ‌రాలు అందిస్తున్నారు. శివ‌రాజ్ కుమార్, దివ్యేందు శ‌ర్మ‌, జ‌గ‌ప‌తి బాబు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 
Go Back to Shorts
Chiranjeevi
Ram Charan
Happy Birthday
Peddi Movie
First Look
Janhvi Kapoor
AR Rahman
Telugu Cinema
MegaStar
Tollywood

More Telugu News