పదో తరగతి పేపర్ లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు
- తెలంగాణలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలు
- కామారెడ్డి జిల్లా జుక్కల్ లో నిన్న పేపర్ లీక్
- కొన్ని ప్రశ్నలను పేపర్ పై రాసి బయటకు పంపిన సిబ్బంది
పరీక్షకు కొన్ని నిమిషాల ముందు కొన్ని ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపారు. ఆ ప్రశ్నలు సోషలో మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికను విధుల నుంచి సస్పెండ్ చేశారు.