ట్విట్టర్ ఐకానిక్ బర్డ్ లోగోకు వేలంలో భారీ ధర..!
- గతంలో ఉన్న బ్లూబర్డ్ లోగోను 'ఎక్స్'తో రీ బ్రాండ్ చేసిన మస్క్
- ఈ ఐకానిక్ బర్డ్ లోగోకు తాజాగా వేలం నిర్వహించిన 'ఆర్ఆర్ ఆక్షన్' సంస్థ
- ఏకంగా రూ.30 లక్షలకు అమ్ముడైన ట్విట్టర్ ఐకానిక్ లోగో
అయితే, ఈ ఐకానిక్ బర్డ్ లోగోకు తాజాగా 'ఆర్ఆర్ ఆక్షన్' సంస్థ నిర్వహించిన వేలంలో భారీ ధర పలికింది. ఏకంగా 35వేల డాలర్లకు (రూ.30 లక్షలు) అమ్ముడైంది. 12 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 254 కిలోల బ్లూబర్డ్ లోగోను ఈ భారీ ధరకు విక్రయించినట్లు ఆర్ఆర్ ఆక్షన్ వెల్లడించింది. అయితే, ఈ లోగోను దక్కించుకున్న వ్యక్తి అభ్యర్థన మేరకు అతని వివరాలను వేలం సంస్థ బయటకు వెల్లడించలేదు.