Jagan: వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థివదేహానికి నివాళి అర్పించిన జగన్... ఫొటోలు ఇవిగో!

Jagan pays tributes to YV Subba Reddy monther
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ నిన్న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె వయసు 85 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె... ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పిచ్చమ్మ పార్థివదేహానికి వైసీపీ అధినేత జగన్ నివాళి అర్పించారు. 

బాపట్ల జిల్లా మేదరమెట్లలోని సుబ్బారెడ్డి నివాసానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించి, వైవీ కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు ఆయన తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. సుబ్బారెడ్డి తల్లి అంత్యక్రియల్లో జగన్ పాల్గొనబోతున్నారు.
Go Back to Shorts
Jagan
YV Subba Reddy
YSRCP

More Telugu News