ఈ ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా... ఇంతకింత శాస్తి జరుగుతుంది: కల్వకుంట్ల కవిత
- స్టేచర్ అని విర్రవీగితే స్ట్రెచర్ పైకి చేర్చారన్న రేవంత్ రెడ్డి
- ఇంకా మారకపోతే మార్చురీకి పోతారని వ్యాఖ్యలు
- ఇటువంటి మాటలను తెలంగాణ సమాజం గమనిస్తోందన్న కవిత
మానవత్వంలేని ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవాలని కవిత హితవు పలికారు. ఇటువంటి దుశ్చర్యను తెలంగాణ సమాజం గమనిస్తోందని, సమయం వచ్చినప్పుడు మీకు ఇంతకింత శాస్తి జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను కూడా కవిత పంచుకున్నారు.
స్టేచర్ ఉందని విర్రవీగితే మిమ్మల్ని స్ట్రెచర్ మీదికి చేర్చారు... మీరు ఇంకా మార్చుకోకపోతే మార్చురీకి పోతారు అంటూ రేవంత్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే కేటీఆర్ కూడా స్పందించారు.