రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్... పిచ్చి కుక్క అంటూ ట్వీట్
- స్టేచర్ ఉందని విర్రవీగినవాళ్లనుస్ట్రెచర్ మీదకు పంపారన్న రేవంత్ రెడ్డి
- ఇంకా ఇలాగే చేస్తే మార్చురీకి పోతారని వ్యాఖ్యలు
- ఈ పిచ్చి కుక్క అన్ని హద్దులు దాటేస్తోందంటూ కేటీఆర్ విమర్శలు
రేవంత్ వ్యాఖ్యల వీడియోను పంచుకున్న కేటీఆర్... ఈ పిచ్చి కుక్క సభ్యతకు సంబంధించిన అన్ని హద్దులను దాటేసింది అంటూ ఘాటుగా స్పందించారు.
"నేను అతడి కుటుంబ సభ్యులకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే... వీలైనంత త్వరగా అతడిని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లండి. ఎందుకంటే అతడి పిచ్చి బాగా ముదిరిపోయింది... చివరికి తన చుట్టూ ఉన్నవాళ్లను కూడా కరవడం ప్రారంభిస్తాడు" అంటూ ట్వీట్ చేశారు.