సిరిసిల్లలో లిఫ్ట్ ప్రమాదంలో పోలీస్ ఉన్నతాధికారి మృతి

Police Officer Gangaram died in lift accident
  • ఓ బిల్డింగ్ లో లిఫ్ట్ ప్రమాదం
  • లిఫ్ట్ వచ్చిందనుకుని అడుగుపెట్టిన పోలీస్ అధికారి
  • దుర్మరణం పాలైన టీజీఎస్పీ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్
  • గతంలో తెలంగాణ సచివాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన గంగారామ్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ పోలీసు ఉన్నతాధికారి లిఫ్ట్ ప్రమాదంలో మరణించారు. సిరిసిల్లలోని ఓ బిల్డింగ్ లో లిఫ్ట్ వచ్చిందనుకుని అడుగుపెట్టడంతో ఒక్కసారిగా కిందికి పడిపోయారు. కింద ఉన్న లిఫ్ట్ పై పడి ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో పోలీస్ అధికారి గంగారామ్ (55) దుర్మరణం పాలయ్యారు. 

గంగారామ్ తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన తెలంగాణ సచివాలయానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 
Go Back to Shorts
Police Officer Death
Gangaram
Lift
Sircilla

More Telugu News