Andhra Pradesh: హయగ్రీవ సంస్థకు భూకేటాయింపులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP government cancels allotment of land given to hayagreeva farms
షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్నంలోని హయగ్రీవ సంస్థకు భూముల కేటాయింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థకు చేసిన భూకేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్‌కు 12.41 ఎకరాల భూములను కేటాయించగా, దీనిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సంస్థ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే భూములను స్వాధీనం చేసుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌కు సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. 

2008లో హయగ్రీవ సంస్థకు ప్రభుత్వం భూములను కేటాయించింది. వృద్ధులకు, అనాథలకు కాటేజీల నిర్మాణం కోసం దీనిని కేటాయించింది. పదిహేనేళ్లుగా ఈ ప్రాజెక్టు ముందుకు కదలకపోవడంతో ప్రభుత్వం కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Go Back to Shorts
Andhra Pradesh
Visakhapatnam

More Telugu News