న్యూయార్క్ సమీపంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, పొగ.. వీడియో ఇదిగో!
- మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
- హైవేలు మూసేసిన అధికారులు
- నగరాన్ని దట్టంగా కమ్మేసిన పొగ
ఈ ప్రమాదంలో రెండు వాణిజ్య భవనాలు పూర్తిగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ నివాస సముదాయాలకు నిప్పంటుకోలేదని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కార్చిచ్చుతో సిటీలోని పలు ప్రాంతాలను పొగ కమ్మేయడంతో న్యూయార్క్ గవర్నర్ ఆయా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హెలికాప్టర్లతో నీటిని చల్లుతూ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎమర్జెన్సీ అధికారులు తెలిపారు.