Rohit Sharma: రోహిత్ శర్మ రిటైరవుతాడా, లేదా?... వేచి చూస్తున్న బీసీసీఐ

BCCI waiting for Rohit Sharma decision
షార్ట్స్‌లో చూడండి
గత కొంతకాలంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ స్థాయికి తగిన ఆటతీరు కనబర్చడంలో విఫలమవుతున్నాడు. నిలకడలేమితో కొన్నిసార్లు జట్టుకు భారంగా మారుతున్నాడు. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు రోహిత్ శర్మే కెప్టెన్ అయినప్పటికీ... చివరి టెస్టులో అతడ్నే పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ రోహిత్ శర్మ నుంచి భారీ ఇన్నింగ్స్ లు రావడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే  పరిస్థితి...! 

దాంతో, ఈ మెగా టోర్నీ ముగిశాక హిట్ మ్యాన్ నుంచి కెరీర్ కు సంబంధించి కీలక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆసీస్ లెజెండ్ స్టీవ్ స్మిత్, బంగ్లాదేశ్ సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీమ్ వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పగా... ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ కెప్టెన్సీ వదులుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటాడేమోనని బీసీసీఐ ఎదురుచూస్తోంది. 

మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా... ఈ అంతిమ సమరంలో టీమిండియా, న్యూజిలాండ్ తలపడున్నాయి. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తే... అతడి వారసుడ్ని వెదికే పనిలో బీసీసీఐ నిమగ్నమవుతుంది.
Go Back to Shorts
Rohit Sharma
BCCI
Team India

More Telugu News