KCR: నేడు ఫామ్ హౌస్ లో పార్టీ కీలక నేతలు, ఎమ్మెల్యేలతో భేటీకానున్న కేసీఆర్

KCR meeting with BRS MLAs
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ కేలక నేతలు, ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే అభ్యర్థిని ఈ సమావేశంలో కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీశ్ రావు కూడా హాజరుకానున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ వస్తుంది. అయితే పాతవారిని రెన్యువల్ చేస్తారా? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా? అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే సమావేశంలో పార్టీ పరిస్థితి, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై కూడా చర్చించనున్నారు. పార్టీ బలోపేతంపై నేతలకు సూచనలు చేయనున్నారు.
Go Back to Shorts
KCR
BRS

More Telugu News