రీల్ చేస్తున్నాడని తెలియక కుర్రాడికి బడితపూజ చేసిన పెద్దాయన... వీడియో వైరల్

Senior citizen beat youth in public
  • వికటించిన రీల్ షూటింగ్
  • కుర్రాడు అమ్మాయిని ఏడిపిస్తున్నాడని భావించిన వృద్ధ దంపతులు 
  • కారులోంచి కర్ర తీసి కుర్రాడ్ని ఉతికారేసిన వృద్ధుడు
ఇటీవల కాలంలో రీల్స్ సందడి పెరిగింది. ఫోన్ చేతిలో ఉంటే చాలు... యువత రీల్స్ షూట్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. కొన్ని సార్లు రీల్స్ చిత్రీకరణలో ప్రాణాలు పోగొట్టుకోవడం, కొన్ని రీల్స్ వికటించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ కుర్రాడు రీల్ షూట్ చేసే ప్రయత్నంలో తన్నులు తిన్నాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే... ఓ కుర్రాడు... ఓ అమ్మాయి పక్కన నిల్చుని టీజ్ చేస్తున్నట్టుగా అభినయిస్తున్నాడు. ఇదంతా రీల్స్ లో భాగమే. కానీ, అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వృద్ధ దంపతులు ఆ అబ్బాయి నిజంగానే అమ్మాయిని ఏడిపిస్తున్నాడని భావించి ఆగ్రహానికి గురయ్యారు. 

వెంటనే ఆ పెద్దాయన తన కారులోంచి ఓ కర్ర తీసుకుని కుర్రాడికి బడితపూజ చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఉతికారేశాడు. చివరికి ఆ కుర్రాడ్ని పెద్దాయన తన్నడమే ఒక రియల్ రీల్ అయింది. చుట్టూ ఉన్నవాళ్లు తమ సెల్ ఫోన్లలో ఈ తతంగాన్ని వీడియో తీశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Reel
Senior Citizen
Youth
Shoot
Viral Video

More Telugu News