Police: మలక్‌పేట శిరీష హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన పోలీసులు

Police press meet on Shirisha murder case
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లోని మలక్‌పేటలో వివాహిత శిరీష హత్య కేసు వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. శిరీష హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ శ్యాంసుందర్ తెలిపారు. ఈ కేసులో శిరీష భర్త వినయ్ కుమార్, అతని సోదరి సరిత, మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

మార్చి 1వ తేదీ రాత్రి వినయ్ సోదరి సరిత, శిరీష మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగిందని ఏసీపీ తెలిపారు. శిరీష నర్సుగా పని చేస్తోందని, పలుచోట్ల ఉద్యోగాలు మానేసిందని తెలిపారు. తరుచూ ఉద్యోగాలు మానివేస్తున్నందుకు సరిత నిలదీసింది. "నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. నీ సంగతి తేలుస్తా" అంటూ శిరీష కూడా ఎదురు దాడికి దిగిందని, దీంతో పరస్పరం ఘర్షణ దిగినట్లు తెలిపారు.

ఘర్షణ తర్వాత కాసేపటికి, శిరీష తనకు నిద్రపట్టడం లేదంటూ సరిత వద్ద ఉంటే మత్తు ఇంజెక్షన్ అడిగి తీసుకుందని, శిరీష మీద కోపంతో డోసు ఎక్కువగా ఉన్న ఇంజెక్షన్ ఇచ్చిందని ఏసీపీ తెలిపారు. శిరీష మత్తులోకి జారుకున్న తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి సరిత చంపేసినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని సరిత తన భర్తకు, సోదరుడికి చెప్పిందని మీడియాకు తెలిపారు.

వారు అంబులెన్సును పిలిపించి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తన గురించి తన భర్తకు శిరీష చెడుగా చెబుతుందనే భయంతో హతమార్చినట్లు పోలీసుల దర్యాఫ్తులో వెల్లడైందని ఏసీపీ తెలిపారు.
Go Back to Shorts
Police
Murder
Telangana

More Telugu News