కొడుకుతో కలిసి భర్త గొంతుకోసి చంపేసిన మూడో భార్య
- హైదరాబాద్ లోని పాతబస్తీలో ఘోరం
- చున్నీతో చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి దారుణం
- పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిందితులు
ఈ క్రమంలో సోమవారం మసీయుద్దీన్, షబానాల మధ్య గొడవ జరిగింది. మంగళవారం ఉదయం మసీయుద్దీన్ అపార్ట్ మెంట్ కు వచ్చాడు. అప్పటికే అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్న షబానా.. సమీర్ తో పాటు అతడి స్నేహితుడు ఫరీద్ సాయంతో మసీయుద్దీన్ పై దాడి చేసింది. చున్నీతో మసీయుద్దీన్ చేతులు, కాళ్లు కట్టేసింది. మసీయుద్దీన్ అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. ఆపై గొంతుకోసి హతమార్చారు. మంగళవారం రాత్రి బండ్లగూడ ఠాణాకు వెళ్లి షబానా, సమీర్ లు పోలీసుల ముందు లొంగిపోయారు. హత్యకు కారణాలేంటనే వివరాలు పోలీసులు వెల్లడించలేదు. అయితే, షబానాకున్న వివాహేతర సంబంధమే మసీయుద్దీన్ హత్యకు దారితీసిందని తెలుస్తోంది.