Kiran Bedi: చిరంజీవి గారూ... కూతుళ్లు కూడా వార‌సులే: కిర‌ణ్ బేడీ

Kiran Bedi Special Tweet on Megastar Chiranjeevi goes Viral
షార్ట్స్‌లో చూడండి
త‌న ఇల్లంతా మ‌న‌వ‌రాళ్ల‌తో నిండిపోయింద‌ని, ఇంట్లో ఉన్న‌ప్పుడ‌ల్లా త‌న‌కు లేడీస్ హాస్ట‌ల్ వార్డెన్‌లాగా ఉంటుంద‌ని చిరంజీవి చెప్పిన విష‌యం తెలిసిందే. త‌న కుమారుడు రామ్‌చ‌ర‌ణ్‌కు కొడుకు పుట్టి త‌మ వార‌స‌త్వాన్ని కొన‌సాగించాల‌నే కోరిక ఉన్న‌ట్లు బ్ర‌హ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయ‌న చెప్పారు. అందుకే చ‌ర‌ణ్‌ను ఈసారి ఓ కొడుకును క‌నురా అని అగుడుతుంటాన‌ని, మ‌ళ్లీ అమ్మాయిని కంటాడేమోన‌నే భ‌యం కూడా ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. 

అయితే, వార‌స‌త్వం కోసం ఓ మ‌గ‌బిడ్డ‌ను క‌న‌మ‌ని చెర్రీని అడుగుతుంటాన‌ని చిరు చేసిన ఈ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిరంజీవి వ్యాఖ్య‌ల‌ను ప‌లువురు ఖండించారు. తాజాగా ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై మాజీ ఐపీఎస్ కిర‌ణ్ బేడీ స్పందించారు. కూతుళ్లు కూడా వార‌సులేన‌న్న విష‌యాన్ని న‌మ్మండి, గుర్తించండి అని ఆమె హితువు ప‌లికారు. ఈ మేర‌కు కిర‌ణ్ బేడీ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక పోస్టు పెట్టారు.    

"చిరంజీవి గారూ... దయచేసి కూతురు కూడా ఒక వారసురాలేనని నమ్మడం, గుర్తించడం ప్రారంభించండి. ఇదంతా మీరు కూతురిని ఎలా పెంచుతారు, ఆమె ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. తమ కూతుళ్లను పెంచి, తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న తల్లిదండ్రుల నుంచి నేర్చుకోండి. వారిని బాగా చూసుకుంటే, వారు త‌మ‌ కుటుంబాలను గర్వపడేలా చేస్తారు. ఇప్ప‌టికే చాలా మంది ఈ విష‌యాన్ని నిరూపించారు. అమ్మాయిలేం త‌క్కువ కాదు" అని కిర‌ణ్ బేడీ ట్వీట్ చేశారు. 
Go Back to Shorts
Kiran Bedi
Chiranjeevi
Tollywood

More Telugu News